రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ కార్మికుడితో పాటు ఆటో ట్రాలీ డ్రైవర్ మృతి చెందినట్లు కొల్లూరు పోలీసులు ప్రాథమిక సమాచారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రింగ్ రోడ్డుపై డివైడర్‌లో ఉన్న చెట్లకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు పోస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ముత్తంగి వైపు వెళ్తున్న ఆటో ట్రాలీ వేగంగా వచ్చి నీరు పోస్తున్న కార్మికుడు శ్రీనివాస్ అలియాస్ వీరు (30)ను ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కార్మికుడు శ్రీనివాస్ అలియాస్ వీరుతో పాటు ఆటో నడుపుతున్న శ్రీనాథ్ (26) తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి...