Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సంగెం శివకుమార్

Author
Posted By CK NEWS
| 19 Oct 2026, 10:57 AM | TELANGANA
బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సంగెం శివకుమార్

ముఖ్యమైన పాయింట్స్:

  • కొత్తూరు మండల బిజెపి కార్యకర్తలకు యువ నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసిన సంగెం శివకుమార్
  • కొత్తూరు మండలంలోని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సంగెం శివకుమార్

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ సందర్భంగా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సంగెం శివకుమార్ రంగారెడ్డి జిల్లా,ప్రజలకు,మహిళామణులకు,హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలకు సద్దుల బతుకమ్మతో ముగింపు పలుకుతారన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని, తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఈ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు.బతుకమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని, రైతులు పాడి పంటలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటూ, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సంగెం శివకుమార్ తెలిపారు. మరోసారి జిల్లా ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి