Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు అభినందనీయం

Author
Posted By CK NEWS
| 18 Oct 2026, 10:25 PM | TELANGANA
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు అభినందనీయం

ముఖ్యమైన పాయింట్స్:

  • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సేవలు అభినందనీయం
  • మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత
  • తొలి దశలోనే క్యాన్సర్‌ను పూర్తిగా జయించవచ్చు!
  • మధిరలో విజయవంతంగా ఉచిత మెగా వైద్య శిబిరం!
  • మధిర రిక్రియేషన్ క్లబ్‌లో వందలాది మందికి ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు
  • సి కె న్యూస్ ప్రతినిది మధిర

మధిర : ప్రాణాంతక మహమ్మారి బారిన పడకుండా పేద, మధ్యతరగతి ప్రజలను కాపాడటమే ధ్యేయంగా హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అద్భుతమైన సేవలు అందిస్తోందని మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత కొనియాడారు.స్థానిక ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో మధిర రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో బసవతారకం ఆసుపత్రి సౌజన్యంతో ఈ ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత,సీనియర్ వైద్యులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, క్యాంప్ ఇంచార్జ్ గూడూరు సత్యనారాయణతో కలిసి ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని
ప్రారంభించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత మాట్లాడుతూ, ఆర్థిక స్థోమత లేక మెరుగైన వైద్యానికి దూరంగా ఉంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంత పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను నేరుగా చేరువ చేయాలనే గొప్ప లక్ష్యంతోనే బసవతారకం ఆసుపత్రి ఈ ఉచిత శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. క్యాన్సర్‌ను తొలి దశలోనే పసిగట్టి, సకాలంలో వైద్యం అందిస్తే ఈ వ్యాధిని పూర్తిగా జయించవచ్చునని ఆమె తెలిపారు.సమాజంలో క్యాన్సర్‌పై పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతో పాటు, అత్యాధునిక నిర్ధారణ పరీక్షలను సామాన్యుడి ముందుకు తీసుకురావడమే ఈ వైద్య శిబిరం ప్రధాన ఉద్దేశమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించి ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మధిర రిక్రియేషన్ క్లబ్‌లో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరం ప్రజల నుండి వచ్చిన విశేష స్పందనతో విజయవంతంగా ముగిసింది.ఈ శిబిరంలో స్థానిక ప్రజలు పాల్గొని, నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో ఉచితంగా పరీక్షలు చేయించుకుని, తగిన వైద్య సలహాలు పొందారు.ఈ కార్యక్రమంలో రిక్రియేషన్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చావా రామకృష్ణ,గడ్డం శ్రీనివాసరావు,ములకలపల్లి మోహన్ రావు,తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి