Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

Author
Posted By CK NEWS
| 03 Oct 2026, 08:55 PM | TELANGANA
సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

ముఖ్యమైన పాయింట్స్:

  • సత్తుపల్లి, కల్లూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
  • తల్లాడ మండలంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ

సత్తుపల్లి/కల్లూరు: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సత్తుపల్లిలోని ద్వారకాపురి కాలనీలో, గాంధీనగర్ లో, గుడిపాడు, కల్లూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తల్లాడ మండలం పినపాక ఎస్సీ కాలనీలో ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులైన పేదల గడపగడపకూ చేరుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో.. పలువురు ప్రజాప్రతిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి