సత్తుపల్లి నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన
ముఖ్యమైన పాయింట్స్:సత్తుపల్లి, కల్లూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారంతల్లాడ మండలంలో ఇంటి స్థలాల పట్టాల పంపిణీ సత్తుపల్లి/కల్లూరు: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం సత్తుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సత్తుపల్లిలోని ద్వారకాపురి కాలనీలో, గాంధీనగర్ లో, గుడిపాడు, కల్లూరులో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తల్లాడ మండలం పినపాక ఎస్సీ కాలనీలో ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో...