Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ప్రజల ఫిర్యాదుకు వెంటనే స్పందన

Author
Posted By CK NEWS
| 27 Sep 2026, 06:23 PM | TELANGANA
ప్రజల ఫిర్యాదుకు వెంటనే స్పందన

ముఖ్యమైన పాయింట్స్:

  • ప్రజల ఫిర్యాదుకు వెంటనే స్పందన
  • బోర్‌ పంపును శుభ్రం చేయించిన సర్పంచ్‌ వీరబాబు.
  • సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి

చింతకాని మండలం తిరుమలాపురం గ్రామంలోని 7వ వార్డులో అకాల వర్షాల కారణంగా బోర్‌ పంపులోకి మురుగునీరు చేరడంతో దుర్వాసన వెదజల్లింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు సమస్యను గ్రామ సర్పంచ్‌ చాపలమడుగు వీరబాబు దృష్టికి తీసుకెళ్లారు.*
విషయం తెలిసిన వెంటనే స్పందించిన సర్పంచ్‌ వీరబాబు బోర్‌ పంపును శుభ్రం చేయించడంతో పాటు వాటర్‌ ప్రెస్సింగ్‌ చేయించారు. బోర్‌ నీరు పరిశుభ్రంగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టారు. సమస్యను తక్షణమే పరిష్కరించడంతో 7వ వార్డు ప్రజలు సర్పంచ్‌ వీరబాబుకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.*
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు 7వ వార్డు సభ్యుడు దారెల్లి సురేష్‌, చాపలమడుగు వెంకటేశ్వర్లు, చేపలమడుగు నాగేశ్వరరావు, అంకెర్ల మోహన్‌రావు, బండి నాగరాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.*

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి