Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

లాటరీలో ముస్లిం దంపతులకు వినాయకుడి లడ్డూ

Author
Posted By CK NEWS
| 26 Sep 2026, 11:25 AM | TELANGANA
లాటరీలో ముస్లిం దంపతులకు వినాయకుడి లడ్డూ

ముఖ్యమైన పాయింట్స్:

  • లాటరీలో ముస్లిం దంపతులకు వినాయకుడి లడ్డూ

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్‌ 26 2026: మండల పరిధిలోని రాయమాదారం గ్రామ ప్రధాన సెంటర్‌లో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా తొమ్మిదో రోజు లడ్డూ వేలం పాటను వినూత్నంగా నిర్వహించారు. లడ్డూ కోసం మొత్తం 150 మంది భక్తుల పేర్లను చిటీలపై రాసి లాటరీ పద్ధతిలో విజేతను ఎంపిక చేశారు.
ఈ విధంగా నిర్వహించిన లాటరీలో ఎస్‌కే జానీ దంపతుల పేర్లు రావడంతో వారు లడ్డూను దక్కించుకున్నారు. వినాయకుడి లడ్డూ తమకు లభించడంతో ఎస్‌కే జానీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. లడ్డూ కోసం భక్తులంతా ఆసక్తిగా ఎదురుచూడగా, చిటీల ద్వారా విజేతను ఎంపిక చేయడం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు చివరి రోజు లడ్డూ లాటరీతో సందడిగా ముగిశాయి. గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి