లాటరీలో ముస్లిం దంపతులకు వినాయకుడి లడ్డూ

ముఖ్యమైన పాయింట్స్:లాటరీలో ముస్లిం దంపతులకు వినాయకుడి లడ్డూ సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఏన్కూరు సెప్టెంబర్‌ 26 2026: మండల పరిధిలోని రాయమాదారం గ్రామ ప్రధాన సెంటర్‌లో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా తొమ్మిదో రోజు లడ్డూ వేలం పాటను వినూత్నంగా నిర్వహించారు. లడ్డూ కోసం మొత్తం 150 మంది భక్తుల పేర్లను చిటీలపై రాసి లాటరీ పద్ధతిలో విజేతను ఎంపిక చేశారు. ఈ విధంగా నిర్వహించిన లాటరీలో ఎస్‌కే జానీ దంపతుల పేర్లు రావడంతో వారు లడ్డూను దక్కించుకున్నారు. వినాయకుడి లడ్డూ తమకు లభించడంతో ఎస్‌కే జానీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. లడ్డూ కోసం భక్తులంతా ఆసక్తిగా ఎదురుచూడగా,...