Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పారా క్రీడా ప్రతిభ గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం

Author
Posted By Chand Pasha
| 23 Nov 2026, 09:24 PM | వనపర్తి
పారా క్రీడా ప్రతిభ గుర్తింపునకు దరఖాస్తుల ఆహ్వానం

ముఖ్యమైన పాయింట్స్:

  • ఈ నెల 28న వనపర్తిలో ఎంపిక కార్యక్రమం

వనపర్తి జిల్లాలో పారా క్రీడా ప్రతిభ గుర్తింపు కార్యక్రమానికి అర్హులైన దివ్యాంగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి తెలిపారు.
దివ్యాంగుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్, ఆథ్లెటిక్ మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారా స్పోర్ట్స్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన దివ్యాంగ క్రీడాకారులకు తగిన శిక్షణతో పాటు క్రీడా అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. 12 సంవత్సరాలు పైబడిన అర్హులైన దివ్యాంగులు వనపర్తి జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ ఫారం ద్వారా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అర్హులైన దివ్యాంగ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి