Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఆదివాసీ విద్యార్థి తెల్లం శరత్ హత్యపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Author
Posted By G KALYAN KUMAR
| 19 Nov 2026, 05:36 PM | TELANGANA
ఆదివాసీ విద్యార్థి తెల్లం శరత్ హత్యపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ ఇల్లందు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కరెంట్ ఆఫీస్‌లో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మండల అధ్యక్షులు ఈసాల రామచందర్ మండల ప్రధాన కార్యదర్శి ఈసం హరీష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థి తెల్లం శరత్ హత్యకు కారణమైన దుండగులతో పాటు ఈ ఘటనలో బాధ్యత ఉన్న సత్యసాయి లాడ్జి సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అనుమతులు లేకుండా నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యసాయి లాడ్జిపై తక్షణమే విచారణ జరిపి అక్రమ నిర్మాణమని నిర్ధారణ అయితే కూల్చివేయాలని డిమాండ్ చేశారు.ఐదో షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం పట్టణంలో ఆదివాసీలకు రక్షణ లేకుండా పోతోందని వలస వచ్చిన కొందరు అక్రమంగా భవనాలు లాడ్జీలు హోటళ్లు నిర్మిస్తూ చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు అడ్డుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శించారు ఏజెన్సీ ప్రాంతంలో అమలులో ఉన్న ఆదివాసీ రక్షణ చట్టాలు ఆదివాసీల హక్కులను కాపాడటంలో సమర్థవంతంగా అమలు కావడం లేదని అక్రమ నిర్మాణాలు ఆదివాసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసీ విద్యార్థి శరత్‌కు న్యాయం జరిగే వరకు ఆదివాసీ సమాజం ఐక్యంగా పోరాడాలి ఆదివాసీ మేధావులు పెద్దలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు యువత మరియు ఆదివాసీ శ్రేయోభిలాషులందరూ ఈ న్యాయ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మండల కార్యదర్శి చింత పృథ్వీ చీమల ప్రసాద్ కుంజ లక్ష్మీనారాయణ,కొరస నాగేంద్రబాబు సూర్ణపాక రాకేష్, చీమల విష్ణు బొర్రా సుభాష్ సోది గౌతమి కుంజ హేమలత తదితరులు పాల్గొన్నారు సోది గౌతమి కుంజ హేమలత తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి