Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ప్రతి కుటుంబానికి అండగా ప్రజా ప్రభుత్వం

Author
Posted By G KALYAN KUMAR
| 14 Nov 2026, 05:01 PM | TELANGANA
పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతూ ప్రతి కుటుంబానికి అండగా ప్రజా ప్రభుత్వం

నూతన చేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ 900 మంది నిరుపేద కుటుంబాలకు చేయూత పెన్షన్ రూపంలో ఆర్ధిక భరోసా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని గోల్యతండా గ్రామ పంచాయతీ, హై స్కూల్ గ్రౌండ్ నందు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను స్వయంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ సమాజంలోని వృద్ధులు,వితంతువులు,దివ్యాంగులు,ఇతర అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ సంక్షేమ లక్ష్యమని తెలిపారు.పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని,ఎంతోమంది పేద కుటుంబాలకు జీవనాధారమని పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని,ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమం,అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.నూతనంగా పెన్షన్లు పొందుతున్న లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రతి నిరుపేదకు భరోసా ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబంలో ఆనందం నింపడమే ప్రజా సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు ఈ కార్యక్రమంలో DRDA & అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ విద్యా చందన,ఎంపీడీఓ శ్రీదేవి ,MRO వీర భద్రం గారు,మార్కెట్ చైర్మన్ రాంబాబు ,ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం ఉమా - సురేందర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్,కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ లక్కినేని శ్యామ్ , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి