Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ప్రజా ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

Author
Posted By G KALYAN KUMAR
| 12 Nov 2026, 07:14 PM | TELANGANA
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

నవంబర్.12.కామేపల్లి మండలం కామేపల్లి గ్రామం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన చెక్కుల పంపిణీ,పింఛన్ మంజూరు పత్రాల పంపిణీకి గౌరవ ఎమ్మెల్యే గారు ముఖ్యఅతిథిగా హాజరు.
వైద్య నిమిత్తం ఖర్చు చేసే మొత్తాన్ని సీఎంఆర్ఎఫ్ పేరిట అందజేస్తున్న చెక్కులు కామేపల్లి మండలం 92 మంది లబ్ధిదారులకు 25 లక్షల రూపాయల పైచిలుకు చెక్కులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు కామేపల్లి మండలంలో నూతనంగా మంజూరైన 602 మంది ఫించన్ లభ్ధిధారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్దిరోజులునే ఆరు గ్యారంటీలలో ఒకటేనా మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది-ఎమ్మెల్యే కనకయ్య ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదని ప్రజల్లో ఒక అపోహ ఉన్నది కానీ మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఖాళీ ఖజానాను గత ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు అప్పజెప్పారు రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల ఆగకూడదని ప్రజా అవసరాలే ధ్యేయంగా ప్రతిక్షణం ప్రతి రూపాయి కూడా ప్రజల కోసం వెచ్చిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం,ఉచిత విద్యుత్,రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ళు,రైతు భరోసా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఒంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు చేసిన మొత్తంలో ఎంతో కొంత ఇచ్చి వారికి చేదోడు వాదోడుగా నిలవాలని రేవంత్ రెడ్డి గారి సంకల్పం ప్రకారం తుచా తప్పకుండా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం గత ప్రభుత్వం బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కులాల పేరిట మతాల పేరిట విభజించి లోన్లు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత వారిది.6 గ్యారంటీల్లో లేనప్పటికీ కూడా ఒంటరి మహిళలకు,వితంతువులకు వికలాంగులకు,గీత కార్మికులకు ఫెంఛన్ ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 4లక్షల 50వేల మందికి పింఛన్లు మంజూరు చేసి ఈరోజు పంపిణీ చేస్తున్నాం ఇది ప్రజా ప్రభుత్వం ఘనత ప్రజలందరు,మనకు మంచి చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి కామేపల్లి మండలం కామేపల్లి గ్రామం స్థానిక రైతు వేదికలో వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి గారి పేరిట అందజేసే సిఎంఆర్ చెక్కులు మండలంలోని 92 మంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు 25 లక్షల రూపాయల పైచిలుకు వ్యయం గల చెక్కులను అందజేసి తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నాలుగు లక్షల 50 వేల మంది అర్హులైన లబ్ధిదారులు మంజూరు చేసిన ఫింఛన్ లో భాగంగా కామేపల్లి మండలంలోని వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు గీత కార్మికులకు మంజూరు చేసిన పింఛన్ లో భాగంగా 602 మందికి మంజూరైన ఫింఛన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన ఇల్లందు నియోజక వర్గం గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ రాంరెడ్డి గోపాల్ రెడ్డి కామేపల్లి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గుజ్జర్లపూడి రాంబాబు,డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్,స్ధానిక సర్పంచ్ అజ్మీర బుల్లి, కొండాయిగూడెం, కామేపల్లి సొసైటి చైర్మెన్లు ధనియాకుల హనుమంతరావు, పుచ్చకాయల వీరభధ్రం,జిల్లా కాంగ్రెస్ కమిటి సెక్రెటరి పత్తే మహ్మద్,జిల్లా నాయకులు తోటకూరి శీవయ్య, AMC డైరెక్టర్లు గబ్రూ,బావుసింగ్,పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గోన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి