Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

వేపల గడ్డ తండాలో కలకలం అనుమానస్పదంగా వ్యక్తి మృతి

Author
Posted By G KALYAN KUMAR
| 09 Nov 2026, 12:51 PM | TELANGANA
వేపల గడ్డ తండాలో కలకలం అనుమానస్పదంగా వ్యక్తి మృతి

నవంబర్ 9.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని వేపల గడ్డ తండాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.తండాకు చెందిన భూక్య శివ్లా మృతి చెందగా,ప్రాథమికంగా(ఆత్మహత్య)గా భావిస్తున్నప్పటికీ ఘటనపై గ్రామస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.శివ్లా మృతి వెనుక వ్యక్తమవుతున్న కారణాలు మరియు గతంలోనూ ఇదే తరహా ఘటనలు మూడు, నాలుగు చోటుచేసుకున్నాయని గ్రామస్తులు చెబుతుండటంతో తండావాసుల్లో ఆందోళన నెలకొంది.ఒకే ప్రాంతంలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వెనుక కారణాలను వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.ఈ ఘటనపై ఇల్లందు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి,సమగ్ర విచారణ చేపట్టాల్సి ఉంది. మృతదేహాన్ని పరిశీలించి,అవసరమైన వైద్య పరీక్షలు,ఇతర ఆధారాల ద్వారా మృతికి గల కారణాలను నిర్ధారించాల్సి ఉంది. అనుమానాలకు తావులేకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి