Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ - TS ATF సంఘంలో చేరిన మణుగూరు డివిజన్ ATA ఉపాధ్యాయ సంఘ నాయకులు

Author
Posted By G KALYAN KUMAR
| 08 Nov 2026, 06:43 PM | TELANGANA
తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ - TS ATF  సంఘంలో చేరిన మణుగూరు డివిజన్ ATA ఉపాధ్యాయ సంఘ నాయకులు

నవంబర్ 8.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డివిజన్ పరిధిలోని పలువురు ATA సంఘం నుండి ఉపాధ్యాయ నాయకులు TS ATF సంఘంలో చేరారు. కోరగట్ల రాజేశ్వరరావు ఈసం బ్రహ్మయ్య సోలం అశోక్ రావు తోలెం శ్రీకాంత్ ఈసాల రాంబాబు ఈసం సుందర్ రావు కొమరం రామారావు ఈసం సమ్మయ్య కాయం సమ్మయ్య తోలెం సాంబశివరావు తదితరులు సంఘంలో చేరారు. TS ATF సంఘం ఆదివాసీ ఉపాధ్యాయుల పదోన్నతులు కోసం,జాతి సంక్షేమం కోసం చేసిన పోరాటాలు సంఘం పని విధానం,సంఘం నాయకుల క్రమశిక్షణ, అంకితభావం నచ్చి ఆకర్షితులై తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్ (TS ATF) సంఘంలో చేరినట్లు కోరగట్ల రాజేశ్వరరావు అన్నారు. మణుగూరు డివిజన్ లో TS ATF సంఘాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా మణుగూరు ప్రాంతంలో పని చేస్తామని అన్నారు
కోరగట్ల రాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న TS ATF రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ల శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధానకార్యదర్శి కబ్బాకుల రవి మాట్లాడుతూ TS ATF సంఘంలో సభ్యత్వం పొందిన ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఉపాధ్యాయుల సర్వీసుకు సంభందించినవి,మరియు కొన్ని ఆర్థిక పరమైన విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేసి ఆదివాసీ ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని అన్నారు. అలాగే జాతి సంక్షేమం కోసం జీ ఓ నంబరు 3 పోరాటంలో భాగంగా ఏజన్సీ ఉద్యోగాల నియామకాలు, పదోన్నతులు కోసం TS ATF పోరాడటానికి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.PRC,పెండింగ్ DA లు వెంటనే ప్రకటించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి TS ATF రాష్ట్ర ప్రచార కార్యదర్శి కుర్సం అంజయ్య, రాష్ట్ర కార్యదర్సు లు చాపల రమేష్ బాబు, ఉండం నాగేంద్ర బాబు, కోరం సంతోష్, పాయం ఆనందరావు,కుంజ కృష్ణ భద్రాద్రి కొత్త గూడెం అధ్యక్షులు కారం రాంబాబు ప్రధాన కార్యదర్శి ఊకె కృష్ణ, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల లక్షమయ్య, భద్రాద్రి జిల్లా గౌరవ అధ్యక్షులు కంగల వెంకయ్య,కోశాధికారి పూనెం బాలరాజు,కార్యదర్సులు ముడిగ వెంకటేశ్వర్లు,పాయం రమేష్,మోకాళ్ళ కృష్ణర్జున్ రావు, పెండేకట్ల నాగేశ్వరావు, పూనెం కమలాకర్, బొల్లి అంజయ్య,మోకాళ్ల ప్రభాకర్, కల్తీ వీరభద్రం, కొడెం కృష్ణయ్య, ఆరెం రవికుమార్,గీత పల్లి కృష్ణ, కల్తీ రామకృష్ణ,పాయం అబ్బయ్య, కారం రాంబాబు, కట్టం రామూర్తి,ఇర్ప భుజంగరావు, జిమ్మ కాంతారావు, సాగబోయిన కృష్ణబాబు, ఈసం సమ్మయ్య పాల్గొన్నారు

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి