Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

అర్హులైన ఓటర్లకు మరో అవకాశం

Author
Posted By News Desk
| 07 Nov 2026, 09:35 PM | వనపర్తి
అర్హులైన ఓటర్లకు మరో అవకాశం

ముఖ్యమైన పాయింట్స్:

  • నవంబర్ 21 వరకు ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించాలి: అదనపు కలెక్టర్ వినోద్ కుమార్

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR-2026) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ తెలిపారు.
శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన ఓటర్లు నవంబర్ 21వ తేదీలోపు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించాలని సూచించారు. ఇప్పటికే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ ఎన్యుమరేషన్ ఫారం సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వనపర్తి నియోజకవర్గంలో గైర్హాజరు, చిరునామా మార్పు, మరణం తదితర కారణాలతో ముసాయిదా ఓటరు జాబితాలో 38,564 మంది పేర్లు తొలగిపోయినట్లు తెలిపారు. వీరిలో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును తిరిగి పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఎల్వోల ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసి, నవంబర్ 21లోపు వాటిని తిరిగి స్వీకరిస్తామని వెల్లడించారు.
ఓటర్లు తమ పాత ఎపిక్ నంబర్ ఆధారంగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్, ECI Net యాప్ ద్వారా కూడా ఎన్యుమరేషన్ ఫారాలను డౌన్‌లోడ్ చేసుకుని సమర్పించవచ్చని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో రామ్‌రెడ్డి, సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి