Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భజలాల పెంపు

Author
Posted By G KALYAN KUMAR
| 06 Nov 2026, 09:34 PM | TELANGANA
ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భజలాల పెంపు

సీకే న్యూస్ ప్రతినిధి ఇల్లందు నవంబర్ 6.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సుదిమళ్ల గ్రామ సర్పంచ్ కుంజా సుకనయ్య పిలుపునిచ్చారు.ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పెరిగే అవకాశం ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి హనుమంతుల పహాడ్.
భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్యను అధిగమించడంతో పాటు భూగర్భజలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద విధిగా ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని ఇల్లందు మండలం సుదిమళ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కుంజా సుకనయ్య ప్రజలకు సూచించారు.ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో నీటి కొరత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.వర్షపు నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకేలా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలు పెరగడమే కాకుండా, ఇళ్ల పరిసరాలు, బహిరంగ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా పరిశుభ్రత మెరుగుపడుతుందని వివరించారు.భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సర్పంచ్ కుంజా సుకనయ్య పిలుపునిచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి