Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి

Author
Posted By Bhargav raju manne
| 01 Nov 2026, 10:10 AM | Array
ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి

ముఖ్యమైన పాయింట్స్:

  • "ములుగు జిల్లా ఆన్లైన్ మోసాల పట్ల పోలీస్ శాఖ భారీ ర్యాలీ."
  • "సైబర్ నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.!"
  • "అనుమానస్పద ఆన్లైన్ లింకుల పట్ల అవగాహన తప్పనిసరి.!"
  • "ఓటిపి చేజారితే - బ్యాంకు ఖాతా ఖాళి జరభద్రం.!"
  • "ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్"

ములుగు జిల్లాలో ఆన్లైన్ మోసాల పట్ల అవగాహన సదస్సు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసపూరిత పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు...సైబర్ మోసాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద లావాదేవీలు ఎదురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు... సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్, ఐపీఎస్ సూచించారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు “ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి” అనే నినాదంతో సైబర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.... సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసపూరిత పద్ధతులతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరో మారు గుర్తు చేశారు..ప్రజలు తమ బ్యాంకింగ్ వివరాలను గోప్యంగా ఉంచుకోవాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి