Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

తూర్పుగూడెం గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు – సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

Author
Posted By G KALYAN KUMAR
| 30 Oct 2026, 07:41 PM | TELANGANA
తూర్పుగూడెం గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు – సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పెగల్లపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్థుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న ఈ రోడ్డు నిర్మాణ పనులతో గ్రామ ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలగనుంది.
ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యామ్, సర్పంచ్ కోరం హనుమంతు, ఉప సర్పంచ్ ఝాన్సీ, గ్రామ శాఖ అధ్యక్షులు మురళీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వయ్య, భద్రు, భాస్కర్,లింగ తదితరులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి