Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

పాంచజన్య సంకల్ప సభ ప్రాంగణాన్ని పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన TRS పార్టీ జిల్లా అధ్యక్షులు రాథోడ్ బాపురావు

Author
Posted By CK NEWS
| 22 Oct 2026, 07:51 PM | TELANGANA
పాంచజన్య సంకల్ప సభ ప్రాంగణాన్ని పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన TRS పార్టీ జిల్లా అధ్యక్షులు  రాథోడ్ బాపురావు

ముఖ్యమైన పాయింట్స్:

  • అక్టోబర్ 30న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలి
  • సభా ప్రాంగణాన్ని పరిశీలించిన తెలంగాణ రక్షణ సేన TRS పార్టీ జిల్లా అధ్యక్షులు రాథోడ్ బాపురావు
  • సికె.న్యూస్. ఇంద్రవెల్లి

ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్టోబర్ 30న నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని (TRS) పార్టీ జిల్లా అధ్యక్షులు బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపునిచ్చారు ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ రక్షణ సేన (TRS )పార్టీ స్టేట్ టీం సభ్యులు, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి మెస్రం దయాకర్‌తో కలిసి రాథోడ్ బాపురావు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రాంగణం అనుకూలత, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై నాయకులు చర్చించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. అక్టోబర్ 30న జరిగే పాంచజన్య సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా గ్రామాలు, మండలాల వారీగా సమన్వయంతో కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొన్నారు. సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి