Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మినీ స్టేడియం, జిమ్‌, వాలీబాల్‌ కోర్టులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి

Author
Posted By BHUKYA LAKSHMI
| 22 Oct 2026, 10:33 AM | TELANGANA
మినీ స్టేడియం, జిమ్‌, వాలీబాల్‌ కోర్టులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి

ముఖ్యమైన పాయింట్స్:

  • ఇల్లెందులో క్రీడా వసతులకు కొత్త ఊపు
  • మినీ స్టేడియం, జిమ్‌, వాలీబాల్‌ కోర్టులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి
  • క్రీడాకారులతో కలిసి వాలీబాల్‌, బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచిన శీనన్న

ఇల్లెందు:* నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన మినీ స్టేడియం క్రీడాకారులకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం స్టేడియాన్ని ప్రారంభించారు. అనంతరం జిమ్‌ విభాగం, వాలీబాల్‌ కోర్టులను ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పొంగులేటి, మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి క్రీడాకారులతో కొద్దిసేపు వాలీబాల్‌, బ్యాడ్మింటన్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలోని జిమ్‌లో వ్యాయామం చేశారు.
*ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..* విద్యతోపాటు క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు అవసరమైన వసతులను కల్పిస్తామని తెలిపారు. ఇల్లెందు మినీ స్టేడియాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసి జాతీయస్థాయిలో నిలుపుతామని హామీ ఇచ్చారు.
*ఈ కార్యక్రమంలో:* పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మినీ స్టేడియం, జిమ్‌, వాలీబాల్‌ కోర్టులు ప్రారంభించిన మంత్రి పొంగులేటి - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి