Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..

Author
Posted By BHUKYA LAKSHMI
| 22 Oct 2026, 10:20 AM | TELANGANA
దసరా వేళ స్వగ్రామానికి పొంగులేటి..

ముఖ్యమైన పాయింట్స్:

  • నారాయణపురంలో పండుగ సందడి
  • పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు.. గ్రామస్తులకు శుభాకాంక్షలు

*కల్లూరు:* దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన నారాయణపురానికి చేరుకున్నారు. సోమవారం రాత్రి గ్రామంలో బస చేసిన ఆయన.. మంగళవారం ఉదయం స్థానిక దేవాలయంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.పంచె, లాల్చీ ధరించి, అంచులున్న కండువాను మెడలో వేసుకుని పూజల్లో పాల్గొన్న మంత్రి.. పండుగ వేళ స్వగ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.
*గ్రామస్తులతో ఆత్మీయ పలకరింపులు..*
మంత్రి స్వగ్రామానికి చేరుకోవడంతో నారాయణపురంలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరించిన పొంగులేటి.. ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళ తమ మధ్యకు వచ్చిన మంత్రిని కలుసుకోవడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి