Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

మంత్రి సీతక్కను కలిసిన TJA ములుగు జిల్లా నూతన కమిటీ

Author
Posted By CK NEWS
| 21 Oct 2026, 03:49 PM | TELANGANA
మంత్రి సీతక్కను కలిసిన TJA ములుగు జిల్లా నూతన కమిటీ

ముఖ్యమైన పాయింట్స్:

  • మంత్రి సీతక్కను కలిసిన TJA ములుగు జిల్లా నూతన కమిటీ
  • శాలువాలతో సన్మానించి అభినందించిన మంత్రి సీతక్క
  • జర్నలిస్టుల సంక్షేమానికి సహకారం అందిస్తా
  • జర్నలిస్టులకు మంత్రి సీతక్క భరోసా
  • సి కె న్యూస్ ప్రతినిది

తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) ములుగు జిల్లా నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్కను మంగళవారం సాయంత్రం ములుగు లోని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టులు ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభమని ఆమె కొనియాడారు. తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (TJA ) ములుగు జిల్లాలో నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ కార్యవర్గానికి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు.ములుగు జిల్లాలోని అన్ని యూనియన్ తో మమేకమై జర్నలిస్టులను అన్ని విధాలా ఆదుకునేలా చూస్తామని అన్నారు.తన వంతు సహాయ సహకారాన్ని ఎల్లవేళలా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు అందిస్తానని భరోసా ఇచ్చారు.జర్నలిస్టుల ఆరోగ్య బీమా, ఇల్లు, ఇతర సంక్షేమ పథకాల అమలులో కృషి చేస్తామని, జిల్లాలో మీడియా రంగ అభివృద్ధికి ఆవశ్యకమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. TJA జిల్లా కార్యవర్గ సభ్యులు మంత్రికి ఈ సందర్బంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో TJA జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి