Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

కామంచికల్ ఆటో ప్రమాద బాధితులను పరామర్శించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి...

Author
Posted By CK NEWS
| 04 Oct 2026, 08:41 PM | TELANGANA
కామంచికల్ ఆటో ప్రమాద బాధితులను పరామర్శించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి...

ముఖ్యమైన పాయింట్స్:

  • కామంచికల్ ఆటో ప్రమాద బాధితులను పరామర్శించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి...

​ఇటీవల జరిగిన ఘోర ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న కామంచికల్ గ్రామానికి చెందిన కోళ్ళ లక్ష్మి, ఉమారాణి, యాసారపు ధనలక్ష్మి, బొమ్మగాని నారమ్మ, మాదాసు రమణ, కొంపల్లి మంగమ్మ, మరియాల కలమ్మ, గండు వీరలక్ష్మి, ఎర్రసంగి పార్వతి, రమణ, యాసారపు కాశీలక్ష్మి, పల్లె రాములమ్మల ని పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి నేరుగా పరామర్శించారు.

​ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, బాధితులకు తగిన వైద్య సహాయం అందేలా చూడాలని సంబంధిత వైద్యాధికారులను కోరారు. బాధితుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా తానూ, తన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని కొండంత భరోసా ఇచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి