Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ (MENU)

అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో నే కాలక్షేపం.

Author
Posted By CK NEWS
| 30 Sep 2026, 08:46 PM | TELANGANA
అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో నే కాలక్షేపం.

ముఖ్యమైన పాయింట్స్:

  • అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో నే కాలక్షేపం.. పరిపాలనను గాలికి వదిలేశారు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
  • సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సి కె న్యూస్ ప్రతినిది
అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆవేశానికి లోనై ఆక్రోశంతో సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం, సంస్కారం పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని కానీ అందుకు భిన్నంగా వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి