క్రిస్మస్ వేడుకల నిర్వహణకు చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సహాయం

ముఖ్యమైన పాయింట్స్:ఈ నెల 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సిరాజుద్దీన్ అహ్మద్ తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చర్చిలకు సున్నం వేయడం (వైట్‌వాష్), విద్యుత్ దీపాలంకరణ తదితర ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి చర్చికి రూ.30,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని నమోదిత చర్చిల నిర్వాహకులు 2026 నవంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు OBMMS...