కార్మికులపై దాడులు చేస్తే సహించేది లేదు!

ముఖ్యమైన పాయింట్స్:నల్గొండ మున్సిపల్ కార్మికురాలిపై దాడి ఘటనకు నిరసనగా సత్తుపల్లిలో కార్మికుల ఆగ్రహం• నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల బహిష్కరణ• నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్• కార్మికుల భద్రతకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిరసన సత్తుపల్లి: పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్య పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికులపైనే దాడులు జరగడం దారుణమని సత్తుపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్మికురాలిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మున్సిపల్ కార్మికులు శనివారం ఉదయం విధులను బహిష్కరించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. కార్మికుల...