టేకులపల్లి లో భారత మాజీ ప్రధానమంత్రి ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలాల్లో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నేడు టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ఎక్స్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించి,ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలను,పేద ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను, దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కినేని శ్యామ్,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు,ప్రధాన కార్యదర్శి...