గ్రూప్-2, గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం
ముఖ్యమైన పాయింట్స్:మైనారిటీ అభ్యర్థులు నవంబర్ 26లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి – జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ సీకే న్యూస్ ప్రతినిధి – వనపర్తి జిల్లా, నవంబర్ 18: తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-2, గ్రూప్-3 పోటీ పరీక్షలకు ఉచిత బేసిక్ ఫౌండేషన్ కోచింగ్ అందించనున్నట్లు వనపర్తి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ అహ్మద్ తెలిపారు. ఈ కోచింగ్కు అర్హులైన మైనారిటీ అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ మైనారిటీ వర్గాలకు చెందిన...