కొప్పురాయి ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని కొప్పురాయి ఎంపీపీఎస్ పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అర్పించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బాలల దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు,సీతారాములు,సుప్రియ,అంజలి,విద్యార్థులు పాల్గొన్నారు.