ఇల్లందు మండలంలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం(శుక్రవారం ) 1:00 గంటలకు ఇల్లందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు ప్రజాప్రతినిధులు,అధికారులు,నూతన పింఛన్ లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.