అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం

బీరంగూడ, నవంబర్ 12 (సీ కే న్యూస్ ప్రతినిధి ): దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించడంలో ముందుండే బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ పరిధిలోని బీరంగూడలో నిర్మాణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7,00,116 విరాళంగా అందజేశారు. ముఖ్యంగా ద్వారపాలకుల మండపం నిర్మాణం కోసం ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ నెల 22న నిర్వహించనున్న అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని పృథ్వీరాజ్ దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో సమావేశమై ప్రతిష్ఠా మహోత్సవ ఏర్పాట్లతో పాటు దేవస్థాన...