నవంబర్ నెలాఖరులోగా తొలి విడత భూ రీసర్వే పూర్తి చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:రీసర్వేలో పారదర్శకత పాటించాలి.. ప్రజల అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి – అదనపు కలెక్టర్ టి. వినోద్ కుమార్ వనపర్తి, నవంబర్ 11: జిల్లాలో తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను నవంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) టి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. రైతులకు, ప్రజలకు భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు, వివాదాలు తలెత్తకుండా రీసర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో భూముల రీసర్వేపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ...