మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ

ముఖ్యమైన పాయింట్స్:గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవకాశం సీకే న్యూస్ ప్రతినిధి వనపర్తి జిల్లా: తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు టీజీపీఎస్సీ గ్రూప్స్‌-1, 2, 3, 4తో పాటు టీజీపీఆర్‌బీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల పోటీ పరీక్షలకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎం.డి. సిరాజుద్దీన్ తెలిపారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, బౌద్ధ మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు 2026 నవంబర్ 12వ తేదీన వనపర్తి ఐడీఓసీ కార్యాలయంలోని జిల్లా...