మైనారిటీ యువతకు ఉచిత విదేశీ భాషా శిక్షణ
ముఖ్యమైన పాయింట్స్:జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, కొరియన్ భాషల్లో ఫౌండేషన్ కోర్సు - దరఖాస్తులకు ఆహ్వానం తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ విద్యావంతులైన యువత కోసం ఉచిత ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీ ఎం.డి. సిరాజుద్దీన్ తెలిపారు. జపనీస్, జర్మన్, ఫ్రెంచ్ మరియు కొరియన్ లాంగ్వేజ్ లో ఉచిత ఫౌండేషన్ కోర్సులో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఆయన కోరారు. అర్హులైన మైనారిటీలు (Muslim, Christian, Sikh, Jain & Buddhist) నిరుద్యోగ యువత అవసరమైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకోవడానికి క్రింది మెయిల్ ఐడి ద్వారా...