దివ్యాంగులకు రాష్ట్రస్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
ముఖ్యమైన పాయింట్స్:నవంబర్ 16లోగా దరఖాస్తులు సమర్పించాలి – జిల్లా సంక్షేమ శాఖ అధికారి సీకే న్యూస్ ప్రతినిధి వనపర్తి జిల్లా: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 3, 2026న హైదరాబాద్లో రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన దివ్యాంగులు, దివ్యాంగుల సంక్షేమం కోసం విశేష సేవలందించిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలకు రాష్ట్రస్థాయి అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని అర్హులైన దివ్యాంగులు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. అవార్డులకు సంబంధించిన దరఖాస్తు నమూనాలు, మార్గదర్శకాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://depwd.sctg.tp.gov.in� నుంచి డౌన్లోడ్...