విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం - సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య
రామచంద్రాపురం, నవంబర్ 06(నవజ్యోతి ప్రతినిధి): విద్యార్థులు చిన్ననాటి నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు ఇతరుల హక్కులను గౌరవించాలని సంగారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య సూచించారు. హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో రామచంద్రాపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, బాలల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టం, సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలికల భద్రత,...