40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్ల తొలగింపునకు తాత్కాలిక బ్రేక్
పటాన్చెరు, నవంబర్ 06(నవజ్యోతి ప్రతినిధి): ఓల్డ్ ఎం.ఐ.జి. ప్రాంతంలో గత 40 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేద కుటుంబాల ఇళ్ల తొలగింపు చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రైల్వే అధికారులు, పోలీసులు ఇళ్ల తొలగింపునకు వచ్చిన విషయం తెలుసుకున్న పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి వెంటనే అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి తొలగింపు చర్యలను నిలిపివేయాలని కోరారు. దశాబ్దాలుగా అక్కడే నివాసం ఉంటున్న పేద కుటుంబాలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించకుండా ఇళ్లను తొలగించడం అన్యాయమని, దీనివల్ల అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో ఫోన్లో మాట్లాడి బాధితుల సమస్యను...