డిసెంబర్ 9 చలో హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం. ఆదివాసి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మైపతి అరుణ్ కుమార్ ఇల్లందులో రాష్ట్ర కోశాధికారి కల్తి రాంప్రసాద్ ఆధ్వర్యంలో సన్నాక సమావేశం నిర్వహించడం జరిగింది. ఆదివాసి హక్కుల సాధన దయంగా డిసెంబర్ 9 చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన అల్టిమేట్ చేయాలని ఉద్దేశంతో కార్యక్రమంలో ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడెం వెంకటేశ్వర్లు, పెండకట్ల యాకయ్య,కల్తీ రాంప్రసాద్,బచ్చల వెంకటేశ్వర్లు,వాసం శ్రీకాంత్ మొదలవారు పాల్గొన్నారు.