విమర్శనాత్మక మూల్యాంకనంతోనే పరిశోధనకు శాస్త్రీయ గుర్తింపు
పటాన్చెరు, నవంబర్ 05(సీ కే న్యూస్ ప్రతినిధి): పరిశోధనలోని శాస్త్రీయ స్వభావం కేవలం అధ్యయనం చేసే అంశంపై మాత్రమే కాకుండా, పరిశోధన పద్ధతులు, పరీక్షలు, విమర్శనాత్మక మూల్యాంకనం, జ్ఞానాన్వేషణ విధానాలపై ఆధారపడి ఉంటుందని ఐసర్ మొహాలీ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం తత్వశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫిలోస్ కోషి పేర్కొన్నారు. హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, అప్లైడ్ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘విజ్ఞానశాస్త్రాన్ని శాస్త్రీయంగా మార్చేది ఏమిటి? మారుతున్న పద్ధతులు, వాస్తవికత భావనలు’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన డాక్టర్ ఫిలోస్ కోషి శాస్త్రీయ పరిశోధనలో తార్కికత,...