జర్నలిజం వృత్తి విలువలను కాపాడుకోవాలి - దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిలుపు
పటాన్చెరు, నవంబర్ 04(సీ కే న్యూస్ ప్రతినిధి): జర్నలిజం వృత్తి విలువలు, నైతిక ప్రమాణాలను కాపాడుకుంటూ ప్రజల్లో విశ్వసనీయతను పెంపొందించుకోవాల్సిన బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉందని ప్రముఖులు దేవులపల్లి అమర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితుల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘాలు మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. గతంలో జర్నలిస్టు సంఘాల పోరాటాల ఫలితంగా హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు అమలయ్యాయని గుర్తుచేశారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఆరోగ్య బీమా సదుపాయం లేకపోవడం ఆందోళనకరమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారుతున్నాయని, దీంతో ఆసుపత్రులు వైద్య సేవలు...