కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
భద్రాద్రి కొత్తగూడెం /టేకులపల్లి మండలం రేగుల తండా గ్రామానికి చెందిన ఇస్లావత్ మాన్సింగ్ అనారోగ్యంతో మృతి చెందడంతో, విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కష్టకాలంలో అండగా నిలుస్తూ రూ.10,000/- ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ, మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించిన కోరం సురేందర్ సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజయ్,గణేష్,ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.