అనుమతులు లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు.. వాహనం సీజ్
పటాన్చెరు, నవంబర్ 03(సీ కే న్యూస్ ప్రతినిధి): బొల్లారం పట్టణంలో అనుమతులు లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు చేపడుతున్న బోర్‌వెల్ వాహనాన్ని జిన్నారం రెవెన్యూ సిబ్బంది మంగళవారం సీజ్ చేశారు. బొల్లారం పట్టణంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా బోర్‌వెల్ వేస్తున్నట్లు గుర్తించిన రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. బోర్‌వెల్ తవ్వకాలకు ఉపయోగిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకుని, తదుపరి చర్యల నిమిత్తం ఐడీఏ బొల్లారం పోలీసులకు అప్పగించారు. అనుమతులు లేకుండా బోర్‌వెల్ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.