యువ ఆవిష్కర్తలకు గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ – 2026 రూ.50 లక్షల వరకు నగదు బహుమతులు
పటాన్చెరు, నవంబర్ 03(సీ కే న్యూస్ ప్రతినిధి): దేశవ్యాప్తంగా ఉన్న యువ ఆవిష్కర్తల్లో నూతన ఆలోచనలను ప్రోత్సహించి, వాటిని విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గీతం ఇన్నోవేషన్ ఛాలెంజ్ (జీఐసీ)–2026ను నిర్వహించనుంది. ఈ జాతీయ స్థాయి పోటీలో విజేతలకు దాదాపు రూ.50 లక్షల వరకు నగదు బహుమతులు అందించనుంది. గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో, బోవర్ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ పోటీలో 10 నుంచి 12వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థులు, అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 2025 నుంచి పట్టభద్రులైన వారు పాల్గొనవచ్చు. జూనియర్, సీనియర్ అనే రెండు విభాగాల్లో పోటీలు నిర్వహించి, వినూత్న...