వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
ముఖ్యమైన పాయింట్స్:రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిన్నారం, నవంబర్ 02(సీ కే న్యూస్ ప్రతినిధి): సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ పరిధిలో గల సోలక్పల్లి, ఊట్ల, జిన్నారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వర్షాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గోపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు...