సకుటుంబ సపరివార సమేతంగా..! మంత్రి పొంగులేటి

ముఖ్యమైన పాయింట్స్:సకుటుంబ సపరివార సమేతంగా..!దసరా పర్వదినోత్సవాన.. జమలాపురంవేంకటేశ్వరస్వామి, తక్కెళ్లపాడు లలితా రాజరాజేశ్వరి అమ్మవారికి మంత్రి పొంగులేటి కుటుంబం ప్రత్యేక పూజలు ఎర్రుపాలెం:* విజయదశమి (దసరా) పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక సందడి చేశారు. మంగళవారం ఎర్రుపాలెం మండలంలోని ప్రసిద్ధ జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంతో పాటు తక్కెళ్లపాడులోని శ్రీ లలితా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ వేళ దైవదర్శనం చేసుకుని స్వామివారి, అమ్మవారి ఆశీస్సులు పొందారు. *మాతృమూర్తి నుంచి మనవడి వరకు..* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మాతృమూర్తి స్వరాజ్యమ్మ, సతీమణి మాధురమ్మ, కుమారుడు హర్షారెడ్డి...