సత్తుపల్లిలో ఘనంగా సాస్త్రా హాస్పిటల్ ప్రారంభం
ముఖ్యమైన పాయింట్స్:సత్తుపల్లిలో ఘనంగా సాస్త్రా హాస్పిటల్ ప్రారంభంసి కె న్యూస్ ప్రతినిది సత్తుపల్లి *సత్తుపల్లి:* సత్తుపల్లి పట్టణంలో నూతనంగా సాస్త్రా హాస్పిటల్ ప్రారంభమైంది. ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ జి. వినీష్ కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రి వైద్య సేవలు అందించేందుకు అందుబాటులోకి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా సత్తుపల్లిలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జి. వినీష్ కృష్ణ, సాస్త్రా హాస్పిటల్ ద్వారా తన వైద్య సేవలను కొనసాగించనున్నారు. పట్టణ ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా నూతన ఆసుపత్రి ప్రారంభం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంలో ఈ ఆసుపత్రి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు.