ముకుందాపురం న్యూడెమోక్రసీ నాయకుడు ఐలు కంఠ్లమయ్యకు జోహార్లు
ముఖ్యమైన పాయింట్స్:ముకుందాపురం న్యూడెమోక్రసీ నాయకుడు ఐలు కంఠ్లమయ్యకు జోహార్లుఎర్రజెండా కప్పి నివాళులర్పించిన పార్టీ నాయకులు – కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా,సి కె న్యూస్ ప్రతినిధి, ఇల్లందు అక్టోబర్ 13 : సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ముకుందాపురం క్యాంపు గ్రామ కమిటీ సభ్యుడు కామ్రేడ్ ఐలు కంఠ్లమయ్య (కంట్లమయ్య) మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఇల్లందు డివిజన్ నాయకులు నరాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, చిన్నతనం నుంచే న్యూడెమోక్రసీ రాజకీయాల పట్ల ఆకర్షితులైన కంఠ్లమయ్య కొద్దికాలంలోనే గ్రామ కమిటీలో క్రియాశీలక...