తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదిక బతుకమ్మ పండుగ : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదిక బతుకమ్మ పండుగ : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడతెలంగాణ అస్తిత్వ పండుగల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనత తగదు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధనకు, సమస్త ప్రాణకోటికి జీవనాధారమైన ప్రకృతి వైభవానికి ప్రతిరూపమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం నుంచి బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించిందని, అన్ని వర్గాల ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు వేదికగా...