పెండింగ్ అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి: టీజేఏ డిమాండ్
ముఖ్యమైన పాయింట్స్:జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలిపెండింగ్ అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి: టీజేఏ డిమాండ్జర్నలిస్టుల పిల్లలకు విద్యలో 50 శాతం రాయితీ కల్పించాలి ఖమ్మం: జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖమ్మంలో జర్నలిస్టులకు కేటాయించిన 23 ఎకరాల భూమిని అర్హులైన జర్నలిస్టులకు వెంటనే పంపిణీ చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అలాగే పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తక్షణమే మంజూరు చేసి అందించాలని కోరుతూ ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డికి టీజేఏ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజేఏ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి...