స్నేహితుడి ప్రథమ వర్ధంతి వేళ..
ముఖ్యమైన పాయింట్స్:*స్నేహితుడి ప్రథమ వర్ధంతి వేళ..**అనాథ పిల్లలకు అన్నదానం చేసి స్ఫూర్తి చాటిన మిత్రబృందం..**స్నేహం అంటే కలిసి తిరగడం కాదు..మిత్రుడి జ్ఞాపకాలను సమాజ సేవలో సజీవం చేయడమే: స్నేహితులు* పాలకుర్తి 08: స్నేహం అంటే కేవలం కలిసి తిరగడమే కాదు.. మరణించిన మిత్రుడి జ్ఞాపకాలను సమాజ సేవలో సజీవంగా ఉంచడమేనని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన యువకులు... గ్రామానికి చెందిన ఎదునూరి రాజేష్ గారు సంవత్సరం క్రితం అకాల మరణం చెందారు. ఆయన ప్రథమ సంవత్సర వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన తోటి స్నేహితులంతా కలిసి ఒక ఆదర్శవంతమైన కార్యక్రమానికి చేపట్టారు రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు....